భద్రాచలం, ఆగస్టు 10 (ఫ్లాష్ న్యూస్ 24):
- భద్రాచలం వద్ద గోదావరి నీటిమట్టం ఉదయం 8 గంటలకు 43 అడుగులకు చేరింది. ఎగువ ప్రాంతాల్లో కురుస్తున్న వర్షాల కారణంగా ప్రవాహం క్రమంగా పెరుగుతోందని ఇరిగేషన్ అధికారులు తెలిపారు.
- లోతట్టు కాలనీల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని మండల అధికారులు సూచించారు. పునరావాస కేంద్రాలు సిద్ధం చేసినట్టు తహసీల్దార్ వెల్లడించారు.
- పుష్కర ఘాట్ వద్ద భక్తులను అనుమతించడం లేదని, పరిస్థితి సాధారణ స్థితికి వచ్చే వరకు ఆంక్షలు కొనసాగుతాయని పోలీసులు ప్రకటించారు.




